Siddipet: మోడల్ స్కూల్ మధ్యలో రోడ్డు అలైన్మెంట్‌పై బీజేపీ ఆగ్రహం
Siddipet: సిద్దిపేట జిల్లా నాగసముద్రాల తెలంగాణ మోడల్ స్కూల్ ఆవరణను రెండుగా విభజిస్తూ రహదారి అలైన్మెంట్ రూపొందించడంపై బీజేపీ నేత ఖమ్మం వేంకటేశం మండిపడ్డారు.
Siddipet: మోడల్ స్కూల్ మధ్యలో రోడ్డు అలైన్మెంట్‌పై బీజేపీ ఆగ్రహం
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా మండలం నాగ సముద్రాల గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఆవరణను రెండుగా విభజిస్తూ రహదారి అలైన్మెంట్ రూపొందించడం విద్యార్థుల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా మారిందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువుకోవాల్సిన విద్యాలయ ప్రాంగణాన్ని రహదారి కోసం ముక్కలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఒక విద్యాసంస్థకు సంబంధించిన రహదారి అలైన్మెంట్ను పదేపదే మార్చడం వెనుక ఉన్న కారణాలేమిటి ఇప్పటివరకు మూడుసార్లు సర్వే నిర్వహించినప్పటికీ విద్యార్థులకు నష్టం కలిగించే విధంగానే అలైన్మెంట్ ఎందుకు రూపొందించారు గత ఏడాది మోడల్ స్కూల్కు సంబంధం లేకుండా పాఠశాల ఖాతాలో సుమారు రూ.62 లక్షలు జమ చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి ఈ అంశాలన్నింటిపై సమగ్ర విచారణ జరిపి ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని ఖమ్మం వేంకటేశం డిమాండ్ చేశారు.




