Siddipet: అక్కన్నపేటలో బీజేపీ ధర్నా, సరిగ్గా కరెంట్ ఇవ్వాలని డిమాండ్!

Siddipet: సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో వ్యవసాయ విద్యుత్ సరఫరా సరిగ్గా లేదంటూ బీజేపీ నేతల ధర్నా. 8 గంటల కరెంట్ ఇవ్వాలని డిమాండ్.

SRINIVAS, HUSNABAD
Published on: 9 Oct 2026 3:58 PM IST
Siddipet
X

Siddipet: అక్కన్నపేటలో బీజేపీ ధర్నా, సరిగ్గా కరెంట్ ఇవ్వాలని డిమాండ్!

Siddipet: వ్యవసాయ బావులకు కనీసం ఎనిమిది గంటల విద్యుత్తు కూడా సరఫరా కావడం లేదని బీజేపీ నాయకులు పేర్కొంటూ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట విద్యుత్తు సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. మండల అధ్యక్షుడు రామంచ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చౌరస్తా నుంచి సబ్‌స్టేషన్‌ వరకు ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్తు అందించాలని డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యుత్తు సరఫరాలో అంతరాయాల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సకాలంలో విద్యుత్తు అందక పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ బావులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయాలని, కోతలను నివారించి రైతులకు అవసరమైన మేరకు విద్యుత్తు అందించాలని కోరారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు నునావత్‌ మోహన్‌నాయక్‌, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గులోత్‌ తిరుపతినాయక్‌, జిల్లా కో-ఆపరేటివ్‌ కన్వీనర్‌ జనగామ వేణుగోపాలరావు, జిల్లా కార్యవర్గ సభ్యురాలు మేడవెన సరూప, మండల ప్రధాన కార్యదర్శులు చెరుకు సంపత్‌, మడక రవికుమార్‌, మండల ఉపాధ్యక్షుడు బోనగిరి తిరుపతి, మాజీ సర్పంచి జిల్లాల అశోక్‌రెడ్డి, ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గులోత్‌ లక్పత్‌నాయక్‌, జిల్లా ఉపాధ్యక్షుడు బానోతు అనిల్‌, మండల కార్యదర్శి లావుడ్య రైనా నాయక్‌, ముక్కి సమ్మిరెడ్డి, లింగారెడ్డి, సంజీవరెడ్డి, బానోతు సుమన్‌, సలేంద్ర తిరుపతి, గిరిమల రాజు, మాలోత్‌ రాజు, గంగుల కుమార్‌, జంగపల్లి శ్రీనివాస్‌, జంగపల్లి యాదగిరి, తేజ, బల మధు, రాయికుంట తిరుపతి, జీల కనుకయ్య, సత్యనారాయణ, మిట్టపల్లి కుమార్‌, ఆవుల కుమార్‌, శ్రీకాంత్‌, శ్రీనివాస్‌, సంజీవ్‌, కుస రాజు, రాజేష్‌, రమేష్‌, ముక్కెర అఖిల్‌, గడ్డం శ్రీకాంత్‌, గుగులోత్‌ రాజకుమార్‌, పార్టీ కార్యకర్తలు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

SRINIVAS, HUSNABAD

SRINIVAS, HUSNABAD