Siddipet: కాంగ్రెస్ 1000 రోజుల పాలన శూన్యం: సిద్దిపేటలో బీఆర్‌ఎస్ భారీ ర్యాలీ!

Siddipet: కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై సిద్దిపేటలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.

RAJU, SIDDIPET
Published on: 8 Sept 2026 5:35 PM IST
Siddipet
X

Siddipet: కాంగ్రెస్ 1000 రోజుల పాలన శూన్యం: సిద్దిపేటలో బీఆర్‌ఎస్ భారీ ర్యాలీ!

Siddipet: వందరోజుల్లో ఇచ్చిన హామీల అన్నింటిని నెరవేరుస్తామని బూటకపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..... వెయ్యి రోజులు దాటినా ప్రజలకు చేసింది ఏమీ లేదని మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ అన్నారు.

మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సీనియర్ నాయకులు గుండు భూపేష్, పాల సాయిరాం లతో కలిసి వారు మాట్లాడారు...1000 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన వైఫల్యాలను ప్రజల ముందు ఉంచాలని ఉద్దేశంతో వారం రోజుల నిరసన కార్యక్రమాలలో భాగంగా సిద్దిపేటలో బి ఆర్ ఎస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది.

అనంతరం అంబేద్కర్ విగ్రహానికి బిఆర్ఎస్ నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ప్రశ్నిస్తే అరెస్టులు, అడిగితే అడ్డగింపులు అన్న విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.

మహిళలకు,వికలాంగులకు,విద్యార్థులకు ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ నెరవేర్చలేక పోయిందని...... మళ్లీ ఓటు అడగడానికి కాంగ్రెస్ వాళ్లు వస్తే బుద్ధి చెప్పడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేస్తుందని మండిపడ్డారు.

ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తీరు మార్చుకొని ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన, శాసనసభ సమావేశాలను కొనసాగించాలని...... ఎమ్మెల్యేలను అవమానపరిచినందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET

Next Story