Cherial: చేర్యాల ఆసుపత్రికి రూ.10 లక్షల విలువైన వైద్య పరికరాలు!

Cherial: సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి క్యాన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.10 లక్షల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలు, సామగ్రిని అందజేశారు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 12 Oct 2026 9:25 PM IST
Cherial
X

Cherial: చేర్యాల ఆసుపత్రికి రూ.10 లక్షల విలువైన వైద్య పరికరాలు!

చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి క్యాన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో సుమారు పది లక్షల విలువ గల వైద్య పరికరాలను అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరచడంతో పాటు, రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా అత్యవసర వైద్య సేవలకు ఉపయోగపడే ఎమర్జెన్సీ మెడిసిన్, పల్స్ ఆక్సీమీటర్ మానిటర్, 12 ఛానళ్ల ఈసీజీ యంత్రం, ఎల్‌డీఆర్‌పీ లేబర్ రూమ్ టేబుల్స్, ఐరన్ కార్ట్స్ తదితర వైద్య పరికరాలు, అవసరమైన సామగ్రిని ఆసుపత్రి సిబ్బందికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో క్యాన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్ సిద్దిపేట శాఖ జోనల్ హెడ్ లక్ష్మణ్ గౌడ, మేనేజర్ సురేందర్, చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఇన్‌చార్జి డాక్టర్ దేవేందర్‌తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన వైద్య పరికరాలను అందించడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తోడ్పడటం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. సంస్థ చేపట్టిన ఈ సేవా కార్యక్రమం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL