Cheriyal: ఓపెన్ జిమ్‌లో మద్యం తాగుతున్న ఆకతాయిలు.. వాకర్స్ ఇబ్బంది!

Cheriyal: సిద్దిపేట జిల్లా చేర్యాల పెద్ద చెరువు కట్టపై ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ మందుబాబుల అడ్డాగా మారింది. అధికారులు నిఘా పెంచి చర్యలు తీసుకోవాలని వాకర్స్ డిమాండ్ చేస్తున్నారు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 30 Oct 2026 7:30 AM IST
Cheriyal
X

Cheriyal: ఓపెన్ జిమ్‌లో మద్యం తాగుతున్న ఆకతాయిలు.. వాకర్స్ ఇబ్బంది!

సిద్దిపేట జిల్లా, చేర్యాల: చేర్యాల పట్టణంలోని పెద్ద చెరువు కట్ట పై ఓపెన్ జిమ్ మందుబాబులకు అడ్డాగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లో కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.

ప్రతిరోజూ ఉదయం వ్యాయామం, వాకింగ్ కోసం వచ్చే మహిళలు, వృద్ధులు, యువత ఇలాంటి పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రశాంత వాతావరణంలో వ్యాయామం చేసుకోవాల్సిన ప్రదేశం మందుబాబుల అడ్డాగా మారడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఓపెన్ జిమ్ పరిసరాల్లో మద్యం సేవించకుండా నిఘా పెంచాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడాల్సిన ఓపెన్ జిమ్‌ను అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారకుండా కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL