Daulatabad: దౌల్తాబాద్ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

Daulatabad: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను దుబ్బాక కాంగ్రెస్ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

Chindam Karunakar, Dubbak
Published on: 14 Nov 2026 3:56 PM IST
Daulatabad
X

Daulatabad: దౌల్తాబాద్ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

దౌల్తాబాద్: "రైతుల సంక్షేమం కోసం, రాబోయే వాతావరణ మార్పు ఎల్‌నినో పై ముందుగానే స్పందించి హెచ్చరికలు చేయడం చాలా అభినందనీయం. ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని అన్నారు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం పలు గ్రామాల్లో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

అనంతరం వారు మాట్లాడుతూ వ్యాపారస్తులు అన్నదాతల వద్దకే వెళ్లి కొనుగోలు చేయడం పంటలకు మంచి డిమాండ్ లభించడం అనేది సంతోషకరమని గత ప్రభుత్వం వరి అంటేనే ఉరి అని రైతలను అవమానపరిచిందని, రైతులకు పంట పోలాల వద్దనే కోనుగోలు జరగడం సంతోషం అన్నారు మరియు ఐకెపి కేంద్రాల ద్వారా కొనుగోళ్లు సులభతరం కావడం సంతోషకరమైన విషయం అన్నారు.

"కరోనాను ఏ విధంగా అయితే ఐక్యంగా ఎదుర్కొన్నామో, రాబోయే ఎల్నినో (El Nino) ప్రభావాన్ని మరియు నీటి కొరతను కూడా అంతే జాగ్రత్తగా ఎదుర్కోవాలి. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడటం చాలా ముఖ్యమని అన్నారు.ప్రకృతి విపత్తుల విషయంలో పార్టీలకతీతంగా అందరం అప్రమత్తంగా ఉండాలన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak