Siddipet: సిద్దిపేటలో పారిశుద్ధ్యంపై కమిషనర్ ఆకస్మిక తనిఖీ

Siddipet: సిద్దిపేట పట్టణంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ పారిశుద్ధ్య నిర్వహణపై ఆకస్మిక తనిఖీ నిర్వహించి, బహిరంగంగా చెత్త వేస్తే జరిమానాలు విధించాలని ఆదేశించారు.

RAJU, SIDDIPET
Published on: 6 Nov 2026 3:11 PM IST
Siddipet
X

Siddipet: సిద్దిపేటలో పారిశుద్ధ్యంపై కమిషనర్ ఆకస్మిక తనిఖీ

సిద్దిపేట: పట్టణ పరిశుభ్రత కేవలం మున్సిపల్ సిబ్బంది బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా భావించి పారిశుద్ధ్య కార్యక్రమాలకు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గారు అన్నారు. ప్రజలు తమ ఇళ్లలో ఉత్పత్తి అయ్యే చెత్తను తడి, పొడి, హానికర వ్యర్థాలుగా వేరు చేసి కేవలం మున్సిపల్ చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే అందించాలని స్పష్టం చేశారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయరాదని సూచించారు. ఆరుబయట చెత్త వేయడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారడమే కాకుండా దోమలు, ఈగలు వృద్ధి చెంది ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే అవకాశం ఉందన్నారు.

స్వచ్ఛ సిద్దిపేట నిర్మాణంలో పట్టణ ప్రజలందరూ భాగస్వాములై, తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మున్సిపల్ సిబ్బందికి సహకరించి చెత్త రహిత పట్టణంగా సిద్దిపేటను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కమిషనర్ కోరారు.

పట్టణంలోని బ్లాక్ స్పాట్స్ లను గుర్తించి వాటిని వెంటనే పరిశుభ్రం చేయాలనీ, ఆరుబయట చెత్త వేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలని శానిటరి ఇన్స్పెక్టర్ మహేష్ ను ఆదేశించారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET