Koheda: ఉపాధ్యాయుల కొరతపై శనిగరం హైస్కూల్ విద్యార్థుల ధర్నా

Koheda: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఎదుట విద్యార్థుల ధర్నా. టీచర్ల కొరత తీర్చాలని డిమాండ్. ఎంఈఓ నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం.

CH SRINIVAS, HUSNABAD
Published on: 5 Nov 2026 10:00 PM IST
Koheda
X

Koheda: ఉపాధ్యాయుల కొరతపై శనిగరం హైస్కూల్ విద్యార్థుల ధర్నా

కోహెడ: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామంలోని జడిహెచ్ఎస్ ఉన్నత పాఠశాల ఎదుట పదో తరగతి విద్యార్థులు బైఠాయించి ధర్నా చేపట్టారు. పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులు లేక చదువులు సక్రమంగా సాగడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పదో తరగతిలో మొత్తం 74 మంది విద్యార్థులు ఉండగా, గణితం బోధించేందుకు ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారని తెలిపారు.

ఇప్పటికే పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉండగా, ఉన్న ఉపాధ్యాయులను సైతం డిప్యూటేషన్పై ఇతర పాఠశాలలకు పంపించడం పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎంఈఓను ప్రశ్నించినా సరైన స్పందన రావడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

తల్లిదండ్రులు ఫోన్ చేసి ఉపాధ్యాయుల కొరత గురించి అడిగితే, “నేనేమీ చేయలేను" అంటూ ఎంఈఓ సమాధానం చెప్పారని వారు ఆరోపించారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయుల కొరత తమ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

వెంటనే పాఠశాలకు సరిపడా ఉపాధ్యాయులను నియమించాలని, ఇతర పాఠశాలలకు డిప్యూటేషన్పై పంపిన ఉపాధ్యాయులను తిరిగి వెనక్కి రప్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD