Siddipet: జుమ్లా తండాలో భూ భారతి రీ సర్వేను పరిశీలించిన కలెక్టర్ హైమావతి!

Siddipet: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం జుమ్లా తండాలో భూ భారతి రీ సర్వేను పరిశీలించిన కలెక్టర్ కె.హైమావతి. పారదర్శకంగా పనులు పూర్తి చేయాలని ఆదేశం.

SRINIVAS, HUSNABAD
Published on: 1 Oct 2026 5:04 PM IST
Siddipet
X

Siddipet: జుమ్లా తండాలో భూ భారతి రీ సర్వేను పరిశీలించిన కలెక్టర్ హైమావతి!

Siddipet: సిద్దిపేట జిల్లాలో భూ భారతి రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా ఖచ్చితత్వంతో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం కోహెడ మండల పరిధిలోని జుమ్లా తండా లో నిర్వహించిన భూభారతి రీ సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె హైమావతి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దాదాపు 90 సంవత్సరాల క్రితం భూ సర్వే నిర్వహించారని మారుతున్న కాలంతో పాటు పెరిగిన జనాభా వలన భూమి కొరత కారణంగా భూ సమస్యలు అధికంగా తలెత్తాయని, ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి రీ సర్వే నిర్వహిస్తుందని తెలిపారు.రీ-సర్వే సమయంలో భూమి విస్తీర్ణం, సర్వే నంబర్లు, హద్దులు, పట్టా వివరాలు తదితర అంశాలను సంబంధిత రికార్డులతో సరిపోల్చి నమోదు చేయాలని తెలిపారు.

సర్వే ప్రక్రియలో రైతులు, భూ హక్కుదారుల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిర్ణీత గడువులో పూర్తి చేసి, భూ రికార్డులను పకడ్బందీగా నవీకరించాలని కలెక్టర్ ఆదేశించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముందుగా గ్రామ సరిహద్దు నిర్దేశించి, ప్రభుత్వం స్థలాలలో సర్వే చేయాలని, తర్వాత పట్టా, అసైన్డ్ భూములను సర్వే చేయాలని సర్వే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఎస్. నవీన్ కుమార్, అర్ ఐ, సర్వే అధికారులు, గ్రామ సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

SRINIVAS, HUSNABAD

SRINIVAS, HUSNABAD