Husnabad: హుస్నాబాద్ మాతా శిశు ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
Husnabad: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మాతా శిశు ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కె. హైమావతి. 250 పడకల ఆసుపత్రి నిర్మాణ పనుల పరిశీలన.
Husnabad: హుస్నాబాద్ మాతా శిశు ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
డాక్టర్లు, నర్సులు ఇతర సిబ్బంది సమయవేళలు పాటిస్తున్నారా, విధులు టైం టేబుల్ వివరాలను ఆరా తీశారు. అటెండెన్స్ రిజిస్టర్, ఓ పి రిజిస్టర్ వెరిఫై చేశారు. హుస్నాబాద్ నలుమూలల నుండి ఆసుపత్రికి రోగులు వస్తారని ప్రతి ఒక్కరికి మంచి మెరుగైన వైద్యం అందించాలని, నిరు పెద ప్రజలకు మేలిరకమైన వైద్యం అందిస్తున్నామని భరోసా కల్పించాలని సూచించారు.
సీజనల్ వ్యాధులకు సంబంధించి వైద్య పరికరాలు, మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఆసుపత్రిలో పలు విభాగాలకు సంబంధించి వైద్యులు సిబ్బంది కావాలని కోరగా సానుకూలంగా స్పందించి ప్రాధాన్యత మేరకు దగ్గర్లోని ఆసుపత్రి నుండి వైద్యులను సిబ్బందిని హుస్నాబాద్ ఆసుపత్రికి కేటాయించాలని డిఎంఅండ్ఎచ్ఓ ను ఫోన్ ద్వారా ఆదేశించారు.
అనంతరం ఆసుపత్రి ముందు 82 కోట్ల తో చేపట్టిన 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నిర్మాణంలో జాప్యం చేయకుండా నిర్ణిత కాల వ్యవధిలో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చెయ్యాలని ఇంజనీరింగ్ మరియు కాంటాక్టర్ ను ఆదేశించారు.
ఆసుపత్రి నిర్మాణం పనులు చేసే కార్మికుల పిల్లలను దగ్గరలోని అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. కలెక్టర్ వెంట హుస్నాబాద్ ఆసుపత్రి సూపరిండెంట్ శ్రీనివాస్, కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




