Siddipet: ప్రజావాణి అర్జీలను వారంలోగా పరిష్కరించాలి: కలెక్టర్ కె. హైమావతి!

Siddipet: సిద్దిపేట ప్రజావాణిలో 120 అర్జీల స్వీకరణ అర్జీలను వారంలోగా పరిష్కరించి పూర్తి నివేదికలతో హాజరుకావాలని కలెక్టర్ కె. హైమావతి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు.

RAJU, SIDDIPET
Published on: 28 Sept 2026 5:34 PM IST
Siddipet
X

Siddipet: ప్రజావాణి అర్జీలను వారంలోగా పరిష్కరించాలి: కలెక్టర్ కె. హైమావతి!

సిద్దిపేట: సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీ కిరణ్ తో కలిసి జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి వివిధ సమస్యలపై ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజానీ కార్యక్రమానికి వివిధ సమస్యలపై 120 అర్జీలు వచ్చాయి.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతి అర్జీని పరిశీలించి వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. ప్రజలు వారి సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో నమ్మకంతో ప్రజావాణి కార్యక్రమానికి వస్తారని ఆయా సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి వారం రోజుల్లోగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకొని తీసుకున్న చర్యల నివేదికను వచ్చే వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో అందజేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ, సూపర్ ఇంటిండెంట్లు తదితరులు పాల్గొన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET