Dubbaka: రైస్ మిల్లుల్లో కలెక్టర్ హైమావతి సుడిగాలి పర్యటన.. మిల్లర్లకు వార్నింగ్!

Dubbaka: సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి దుబ్బాక, రాయపోల్, దౌల్తాబాద్ మండలాల్లోని పలు రైస్ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

Chindam Karunakar, Dubbak
Published on: 16 May 2026 8:08 AM IST
Dubbaka
X

Dubbaka: రైస్ మిల్లుల్లో కలెక్టర్ హైమావతి సుడిగాలి పర్యటన.. మిల్లర్లకు వార్నింగ్!

Dubbaka: మిల్లులో దిగుమతి లో జాప్యం కాకుండా ఎక్కువ మంది హమాలీలను సమకూర్చుకుని షిఫ్ట్ లా వారిగా దిగుమతి వేగవంతం చెయ్యాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి మిల్లర్ యజమానులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామంలోని లలిత పరమేశ్వర ఇండస్ట్రీస్, అక్బర్ పేట- భుం పల్లి మండలం మోతే గ్రామంలో భారతి ఇండస్ట్రీస్, మంజునాథ ఇండస్ట్రీస్, దౌల్తాబాద్ మండలం ముత్యం పేట గ్రామంలోని స్వాతి ఇండస్ట్రీస్, రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలోనీ శివ సాయి బాలాజీ ఇండస్ట్రీస్ లలో ధాన్యం దిగుమతి ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో తనికి చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు సజావుగా జరగాలంటే లారీలు ట్రాక్టర్ లలో మిల్లులకు పంపించిన ధాన్యాన్ని దిగుమతిలో జాప్యం చేయకుండా వెనువెంటనే దిగుమతి చేసుకోవాలని మిల్లర్ యజమానులను ఆదేశించారు. దిగుమతిలో జాప్యం కాకుండా ఎక్కువమంది హమాలీలను అందుబాటులో ఉంచి షిఫ్ట్ లా వారిగా పని చేయించాలని ఆదేశించారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story