Dubbaka: రామక్కపేట గురుకులంలో కలెక్టర్ హైమావతి ఆకస్మిక తనిఖీ!

Dubbaka: దుబ్బాక మండలం రామక్కపేట బాలికల గురుకులంలో మధ్యాహ్న భోజనాన్ని సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 17 Sept 2026 4:11 PM IST
Dubbaka
X

Dubbaka: రామక్కపేట గురుకులంలో కలెక్టర్ హైమావతి ఆకస్మిక తనిఖీ!

దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి సందర్శించి విద్యార్థినులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అన్నం పప్పు క్యాబేజీ కర్రీ, రసం, గుడ్డు, నెయ్యి లను పరిశీలించారు.

విద్యార్థినులకు అందిస్తున్న భోజనం నాణ్యత, రుచి, పరిశుభ్రత, వంటశాల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. భోజన పదార్థాల తయారీకి వినియోగిస్తున్న సరుకుల నాణ్యతను పరిశీలించి, విద్యార్థినులకు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

స్టాక్ రిజిస్టర్ తనికి చేస్తూ కూరగాయలు పరిమాణం కొలత తనికి చేశారు. వంటశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, భోజనం తయారీ సమయంలో పరిశుభ్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కామన్ డైట్ మెనూ ప్రకారం ప్రతిరోజూ నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK