Siddipet: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో బీఆర్ఎస్‌కు వణుకు మొదలైంది: అత్తు ఇమామ్!

Siddipet: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో బీఆర్ఎస్‌కు వణుకు మొదలైందని, దమ్ముంటే ఎల్లమ్మ ఆలయంలో ప్రమాణం చేయాలని శుక్రవారం అత్తు ఇమామ్ సవాల్ విసిరారు.

RAJU, SIDDIPET
Published on: 20 Nov 2026 7:08 PM IST
Siddipet
X

Siddipet: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో బీఆర్ఎస్‌కు వణుకు మొదలైంది: అత్తు ఇమామ్!

Siddipet: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధిపేట పర్యటనతో బిఆరెస్ నాయకులకు వణుకు మొదలైంది అని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారు అన్నారు. సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే బిఆరెస్ పార్టీ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అని అన్నారు.

బిఆరెస్ పార్టీ నాయకులకు నిజాయితీ ఉంటే సిద్ధిపేట ఎల్లమ్మ ఆలయంలో ప్రమాణం చేయాలి అని సవాల్ విసిరారు. ప్రజలను అబద్ధాలతో ఎన్నాళ్లు మభ్యపెడతారు అని ప్రశ్నించారు. 10 సంవత్సరాల పాలనలో జరిగిన అభివృద్ధిపై ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై బిఆరెస్ పార్టీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమా అని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్ధిపేటలో నిన్న జరిగిన సభలో వాస్తవాలు మాట్లాడితే బిఆరెస్ నాయకులకు మింగుడు పడటం లేదు అని అన్నారు.

అబద్ధాలతో ప్రజలను మళ్లీ మోసం చేయాలని చూస్తున్న బిఆరెస్ నాయకుల ఆటలు ఇకపై సాగనివ్వము అని అన్నారు. సిద్ధిపేట అంటే బిఆరెస్ నాయకుల సొంత ఆస్తి కాదు అని అన్నారు. అధికారం కోల్పోయినా బిఆరెస్ పార్టీ నాయకులకు అహంకారం మాత్రం తగ్గలేదు అని అన్నారు. సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు మాజీ మంత్రి కీ.శే. మదన్ మోహన్ పేరు పెట్టడం అభినందనీయం అని దివంగత నేత సేవలను గుర్తించి ఆయన పేరును పెట్టడం సిద్దిపేటకు తగిన గౌరవం దక్కింది అని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధిపేట పర్యటన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది అని నాయకులు, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది అని అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సిద్ధిపేట శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తాం అని అన్నారు. 10 సంవత్సరాల పాలనలో జరిగిన అభివృద్ధిపై ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై బిఆరెస్ పార్టీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే బిఆరెస్ నాయకుల భరతం పడుతాం అని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్ధిపేట రావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులకు బలం వచ్చింది అని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధిపేట పర్యటనను బహిరంగ సభను విజయవంతం చేసిన జిల్లా అధికారులు పోలీసు శాఖ అధికారులు సిబ్బంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమామ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్యాదారి మధు గయాజుద్దీన్ అర్షద్ హుస్సేన్ విజయ డానియల్ నజ్జు ముద్దు తదితరులు పాల్గొన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET