Dubbaka: కాంగ్రెస్ పార్టీ బలోపేతమే నా లక్ష్యం
Dubbaka: జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన కోమటిరెడ్డి పద్మా రెడ్డి. హైదరాబాద్లో దుబ్బాక ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు.
Dubbaka: కాంగ్రెస్ పార్టీ బలోపేతమే నా లక్ష్యం
దుబ్బాక: హైదరాబాద్లో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి పద్మా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తనపై నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శి గా బాధ్యతలను అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి, అలాగే దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం మాట్లాడుతూ,తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని అన్నారు.
ప్రతి ఒక్క కార్యకర్తను కలుపుకొని, ఎలాంటి విభేదాలకు తావులేకుండా కాంగ్రెస్ పార్టీని జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జనగామ మల్లారెడ్డి, సీనియర్ నాయకులు సోలిపేట ప్రసాద్ రెడ్డి, తాండ్ర విజయపాల్ రెడ్డి,ఆస శరభయ్య తదితరులు పాల్గొన్నారు..




