Siddipet: బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతోంది.. సిద్దిపేట కాంగ్రెస్ ఆరోపణ

Siddipet: ఓటరు సవరణ (SIR) నెపంతో బీజేపీ దేశంలో ఓట్ల చోరీకి పాల్పడుతోందని సిద్దిపేట కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ తీవ్రంగా ధ్వజమెత్తారు.

RAJU, SIDDIPET
Published on: 25 Jun 2026 7:35 PM IST
Siddipet
X

Siddipet: బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతోంది.. సిద్దిపేట కాంగ్రెస్ ఆరోపణ

సిద్దిపేట: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా సిద్ధిపేట పట్టణంలో ప్రతి ఓటరు సర్ ను సద్వినియోగం చేసుకోవాలి అని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారు అన్నారు. SIR ను అడ్డంపెట్టుకుని బిజెపి కేంద్రంలో రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని చూస్తుంది అని అన్నారు.

దేశంలో సర్ పేరుతో బీజేపీ ఓట్ చోరీకి పాల్పడుతున్నది అని ఆరోపించారు. అధికారం ఉంది అని దేశ ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలిచిన ఓటు హక్కును బలహీనపరిచేలా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారు అని అన్నారు. దినిని మొదటి నుంచి కాంగ్రె స్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అని ప్రజాస్వామ్యాన్ని మోదీ ఖూని చేశారు అని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో బిజెపికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి అని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ప్రజలు సహకరించాలీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా మైనార్టీ చైర్మన్ రాశాద్ అసెంబ్లీ యువజన అధ్యక్షులు వహాబ్.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET

Next Story