Siddipet: ప్రతి ధాన్యపు గింజా కొంటాం.. రైతన్నలకు కాంగ్రెస్ భరోసా!

Siddipet: సిద్ధిపేటలో అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఇమామ్ ఆర్డీవో సదానందాన్ని కోరారు.

RAJU, SIDDIPET
Published on: 27 May 2026 9:07 PM IST
Siddipet
X

Siddipet: ప్రతి ధాన్యపు గింజా కొంటాం.. రైతన్నలకు కాంగ్రెస్ భరోసా!

Siddipet: రైతులు మార్కెట్ యార్డులకు తీసుకొచ్చిన ప్రతి ధాన్యం గింజను కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొనుగోలు చేస్తారు అని సిద్ధిపేట పట్టణం కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారు అన్నారు. సిద్ధిపేటలో ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో సదానందం గారిని పట్టణం కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారు కలిసి రైతుల ధ్యానం కొనుగోలు వేగవంతం చేయాలని తడిసిన ధాన్యం ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా పట్టణం కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారు మాట్లాడుతూ నిన్న కురిసిన వర్షానికి రైతులు పండించిన పంట మార్కెట్ యార్డులో తడిసిపోయింది అని అన్నారు. వర్షం వల్ల తడిసిన పంటను అలాగే తీసుకుంటాం అని రైతులు ఎవరు ఆందోళన పడవద్దు అని అన్నారు. నిన్న రాత్రి వర్షానికి ధాన్యం తడిసిపోయింది అని రైతులు ఇబ్బందులు పడితే బిఆరెస్ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతుంది అని అన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET

Next Story