Siddipet: వీధి గూండాల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు: సిద్దిపేట కాంగ్రెస్ ఆగ్రహం!
Siddipet: అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు వీధి గూండాలను తలపించిందని సిద్దిపేట కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ పూజల హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మండిపడ్డారు.
Siddipet: వీధి గూండాల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు: సిద్దిపేట కాంగ్రెస్ ఆగ్రహం!
సిద్ధిపేట: అసెంబ్లీ ప్రారంభం రోజున సభ నడవకుండా చెయ్యాలని కుట్రలు కుతంత్రాలు పన్నాగం పన్ని బిఆరెస్ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు చూస్తే అచ్చం వీథి గుండాలుగా కంటే ఎక్కువగా రెచ్చిపోయారు అని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గం ఇంచార్జ్ పూజల హరికృష్ణ గారు పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారు అన్నారు.
సిద్ధిపేటలో సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గం ఇంచార్జ్ పూజల హరికృష్ణ గారు పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారు మాట్లాడుతూ అసెంబ్లీ మొదటిరోజున ప్రజలు చూస్తే ఏమని అనుకుంటారు అని ఆలోచించకుండా కావాలని బిఆరెస్ ఎమ్మెల్యేలు అంగీలు తీసి అసెంబ్లీకి వచ్చి పరువుతీశారు అని అన్నారు. అలా రావద్దు అని పోలీసులు చెబితే పోలీసుల పై బిఆరెస్ ఎమ్మెల్యేలు వారిని నూకుక్కుంటూ దాడి చేశారు అని అన్నారు.
మల్లీ పోలిసులే మా మీద దాడి చేశారు అని అబద్ధాలు మాట్లాడటం బిఆరెస్ ఎమ్మెల్యేలు కు చెల్లింది అని అన్నారు. అసెంబ్లీ బయట బిఆరెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దూషించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. అధికారం పోవడంతో బిఆరెస్ ఎమ్మెల్యేలకు మతి భ్రమించింది అని వారిని వెంటనే మెంటల్ హాస్పిటల్ లో చేర్పించాలి అని అన్నారు. 10 సంవత్సరాలు ఏమ్మెల్యేలు మంత్రులుగా పనిచేసిన మీరు కనీసం సంస్కారం లేకుండా బరితెగింపు చేస్తున్నారు.
అని అన్నారు. 10 సంవత్సరాలు పాలన చేసిన కెసిఆర్ కు బిఆరెస్ పార్టీ నాయకులకు రాజ్యాంగం మీద గౌరవం లేదు అని అన్నారు. ఫామ్ హౌజ్ లోనె ఉంటున్న కెసిఆర్ చిల్లర రాజకీయాలు చెయ్యమని ట్రైనింగ్ ఇచ్చి అసెంబ్లీకి పంపినట్లుగా ఉంది అని అన్నారు. మీరు చేస్తున్న డ్రామాలు నాటకాలు జిమ్మిక్కులను చూసీ మిమ్మల్ని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు అని అన్నారు.
ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కెసిఆర్ అసెంబ్లీకి రాకుండా కోట్ల రూపాయలు జీతం తీసుకుంటున్నారు అని అసెంబ్లీకి రాను అనుకున్నప్పుడు గజ్వేల్ ఏమ్మెల్యే పదవికి కెసిఆర్ వెంటనే రాజీనామా చేయాలీ అని అన్నారు. మేము ఇష్టం వచ్చినట్లు చేస్తాం అని అడ్డుకుంటే పోలీసులపై దాడి చేయడం చట్టాని చేతుల్లో తీసుకున్నట్లే అవుతుంది అని వెంటనే బాధ్యులైన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ముద్దం లక్ష్మి. బొమ్మల యాదగిరి. దాస్ అంజయ్య. కళీముద్దీన్. మార్క్ పద్మ. కవిత. అంజిరెడ్డి రాశాద్ వహాబ్ గాయాసుద్దీన్ విజయ్ డానియల్ సంతోషి ఆజ్ఞ వంశీ. .పవన్ తదితరులు పాల్గొన్నారు.




