Siddipet: మహిళలకు కాంగ్రెస్ పెద్దపీట: సిద్దిపేటలో చీరల పంపిణీ!

Siddipet: సిద్దిపేట 9వ వార్డులో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు.

RAJU, SIDDIPET
Published on: 12 Oct 2026 10:00 PM IST
Siddipet
X

Siddipet: మహిళలకు కాంగ్రెస్ పెద్దపీట: సిద్దిపేటలో చీరల పంపిణీ!

సిద్ధిపేట: తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా ఇందిరమ్మ చీరలను కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తుంది అని కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీట వేస్తున్నారు అని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారు అన్నారు.

సిద్ధిపేటలో 9వ వార్డులో బతుకమ్మ పండుగ సందర్భంగా వార్డులోని మహిళలకు సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ చేయడం సంతోషంగా ఉంది అని అన్నారు.

మహిళల సంక్షేమం ఆర్థిక స్వావలంబన పేద కుటుంబాల అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తుంది అని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్న్నారు అని అన్నారు. 10 సంవత్సరాలలో బిఆరెస్ చేయని పనులు 3 సంవత్సరాలలో చేసి చూపించాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలానాపై నమ్మకం కలిగించారు అని అన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళల కోసం మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అర్హులైన కుటుంబాలకు రూ.500కే వంట గ్యాస్‌ సిలిండర్‌ గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు రేషన్ కార్డులు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం అని అన్నారు. వీటితోపాటు ఇందిరమ్మ ఇండ్లు చేయూత పథకం ద్వారా ఆరోగ్య బీమా వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం అని అన్నారు.

కాళేశ్వరం కమీషన్ ల కోసం రాష్ట్రం ఖజానా దోచుకున్న కెసిఆర్ కుటుంబం లక్షల కోట్లు రూపాయలు అవినీతి చేసింది అని ఆరోపించారు. సిద్ధిపేటలో భూదంధాలు భూమి కబ్జాలకు కెరాప్ గా బిఆరెస్ నాయకులు మారారు అని అన్నారు. అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి అని అంటే మరో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనీ ప్రజలు ఆశీర్వదించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గయాజుద్దీన్ విజయ డానియల్ సాయి అజ్మత్. నజ్జు తదితరులు పాల్గొన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET