Siddipet: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ విమర్శలు సరికావు అత్తు ఇమామ్

Siddipet: సిద్ధిపేటలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ విలేకరుల సమావేశం నిర్వహించారు.

RAJU, SIDDIPET
Published on: 2 Sept 2026 7:54 PM IST
Siddipet
X

Siddipet: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ విమర్శలు సరికావు అత్తు ఇమామ్

సిద్ధిపేట: 10 సంవత్సరాలలో బిఆరెస్ ప్రభుత్వంలో చేయని అభివృద్ధి పనులు పథకాలు వెయ్యి రోజుల్లో చేశాం అని కాంగ్రెస్ పార్టీ సిద్ధిపేట పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారు అన్నారు. సిద్ధిపేటలో పట్టణం కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధిపేట పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారు మాట్లాడుతూ రైజింగ్ తెలంగాణ లక్ష్యంతో రాష్ట్రంను అభివృద్ధి చేశాం అని కాంగ్రెస్ ప్రభుత్వంకు వస్తున్న స్పందన చూసి బిఆరెస్ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు అని అన్నారు.

వెయ్యి రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు పథకాలు అమలు చేశాం అని బిఆరెస్ పార్టీను నాయకులను ఎక్కడ ప్రజలు మరిచిపోతారో అని రాజకీయ ఉనికి కోసం బిఆరెస్ నాయకులు పాకులాడుతున్నారు అని అన్నారు. అధికారం కోల్పోగానే బిఆరెస్ నాయకులకు మతి భ్రమించింది అని కాంగ్రెస్ ప్రభుత్వంఅధికారంలోకి వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మిద కాంగ్రెస్ ప్రభుత్వం మిద విమర్శలు చేస్తున్నారు అని అన్నారు.

మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే సహించేది లేదు అని అన్నారు. 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు రుణమాఫీ ప్రయోజనం అందించాం అని రైతుకు పెట్టుబడి సహాయం కింద భారీగా నిధులు ఖర్చు చేశాం అని అన్నారు. పేదలకు సన్నబియ్యం రేషన్ కార్డుల పంపిణీ మహిళలకు ఉచిత ప్రయాణం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇలా మహిళలతో పాటు అన్ని వర్గాల వారి అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు అని అన్నారు.

10 సంవత్సరాల కెసిఆర్ పాలనలో కెసిఆర్ కుటుంబమే బాగుపడింది అని ఏ వర్గాలకు కెసిఆర్ సరైన న్యాయం చేయలేదు అని అన్నారు. 10 సంవత్సరాలలో మీరు చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తాం అని దళితులకు 3 ఎకరాలు దళిత బంధు దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని కెసిఆర్ చెప్పిన అన్ని మాయమాటలు ప్రజల గడపగడపకు వెళ్లి చెపుతాం అని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరిస్తూ 10 సంవత్సరాలలో బిఆరెస్ మోసాలపై సిద్ధిపేట లోని అన్ని వార్డుల్లో బిఆరెస్ దోఖా కార్డులను పంచుతాం అని అన్నారు. 10 సంవత్సరాలు ప్రజలు కెసిఆర్ అధికారం లక్షల కోట్లు రూపాయలు దోచుకొని రాష్ట్రంను ప్రజలను మోసం చేశారు అని అన్నారు. అన్ని వార్డుల్లో శుక్రవారం నుంచి బిఆరెస్ దోఖా కార్డులను పంపిణీ చేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్యాదారి మధు గయాజుద్దీన్ అర్షద్ హుస్సేన్ విజయ డానియల్ తదితరులు పాల్గొన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET

Next Story