Siddipet: 'సీపీ కనెక్ట్'లో ప్రతిభ చూపిన పోలీసులకు సీపీ అభినందనలు!
Siddipet: సిద్దిపేట సీపీ కనెక్ట్ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన పోలీసులకు ప్రశంసా పత్రాలు. కోహెడ దొంగలను పట్టుకున్న హుస్నాబాద్ సీఐ, సిబ్బందిని అభినందించిన సీపీ రష్మి పెరుమాళ్.
Siddipet: 'సీపీ కనెక్ట్'లో ప్రతిభ చూపిన పోలీసులకు సీపీ అభినందనలు!
Siddipet: గత కొంతకాలంగా కోహెడ మండల పరిధిలో జరుగుతున్న వరుస దొంగతనాలకు పాల్పడిన దొంగలను పట్టుకోవడంలో ప్రదర్శన కనబరిచిన,శాంతిభద్రతల పరిరక్షణలో మరియు నేరాల నియంత్రణలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను, సిబ్బందిని ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన 'సీపీ కనెక్ట్' కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, IPS ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
గత కొంతకాలంగా కోహెడ మండల పరిధిలో జరుగుతున్న వరుస దొంగతనాలు, ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ దొంగతనాలకు ,పాల్పడుతున్న దొంగలను కొట్టుకోవడంలోఅద్భుతమైన ప్రతిభ కనబరిచిన క్రింది పోలీసు సిబ్బందిని సీపీ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేసినారు. ప్రశంసా పత్రం అందుకున్న వారి లో శ్రీధర్, హుస్నాబాద్ సీఐ, సంపత్ , కోహెడ హెడ్ కానిస్టేబుల్, జి వేణు , కోహెడ కానిస్టేబుల్, లింగ స్వామి హోమ్ గార్డ్ లు ఉన్నారు.




