Siddipet: 250 మోడిఫైడ్ సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించిన పోలీసులు
Siddipet: సిద్దిపేటలో మోడిఫైడ్ సైలెన్సర్లపై ఉక్కుపాదం మోపిన సీపీ రష్మీ పెరుమాళ్. 250 శబ్ద కాలుష్య సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కిస్తూ ధ్వంసం.
Siddipet: 250 మోడిఫైడ్ సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించిన పోలీసులు
సిద్దిపేట: ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ సూచించారు. సిద్దిపేట జిల్లా లో మోడీఫైడ్ సైలెన్సర్స్ తో ప్రజలను ఇబ్బందులు పెడుతున్న దాదాపు 250 సైలెన్సర్స్ లను సిద్దిపేట బ్లాక్ ఆఫీస్ కార్యాలయం వద్ద రోడ్డు రోలర్ తో ఉక్కుపాదం మోపారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ
సిద్దిపేట లో మోడీఫైడ్ సైలెన్సర్స్ పై అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇలాంటి సైలెన్సర్స్ పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి దాదాపు 250 సైలెన్సర్స్ ను గుర్తించి తీసివేయించామన్నారు. వాటిని శనివారం మొత్తం డిస్ట్రాయ్ చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరు
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. మీ కుటుంబం క్షేమం కోసమే తమ ప్రయత్నం అని,ట్రాఫిక్ నిబంధనలు పాటించాపోవడం వల్ల ఎన్నో సంఘటన్లు జరిగి కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. సిద్దిపేట టౌన్ లో చాలా ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.




