Siddipet: 90 మంది పోలీస్ సిబ్బందికి సీపీ రష్మి పెరుమాళ్ పురస్కారాలు
Siddipet: శాంతిభద్రతలు, నేరాల నివారణలో ప్రతిభ చూపిన 90 మంది పోలీస్ అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసిన సిద్దిపేట సీపీ రష్మి పెరుమాళ్.
Siddipet: 90 మంది పోలీస్ సిబ్బందికి సీపీ రష్మి పెరుమాళ్ పురస్కారాలు
సిద్దిపేట: ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు, సిబ్బంది మొత్తం 90 మందికి ప్రశంసా పత్రాలు, నగదు పురస్కారాలను అందజేసిన సిద్దిపేట సిపి రష్మి పెరుమాళ్,
గడిచిన 6 నెలల కాలంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణ, సంక్లిష్టమైన కేసులను ఛేదించడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సిద్దిపేట కమిషనరేట్ పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి మొత్తం 90 మందికి శనివారం నిర్వహించిన 'రివార్డ్ మేళా' వేదికగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, IPS ప్రశంసా పత్రాలు మరియు నగదు పురస్కారాలను అందజేశారు.
ఈ సందర్భంగా సీపీ రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ:
రాత్రింబవళ్లు ప్రజల రక్షణ కోసం, శాంతిభద్రతల పరిరక్షణ కోసం శ్రమిస్తున్న ప్రతి ఒక్కరి కృషిని గుర్తించి ప్రోత్సహించడమే ఈ రివార్డ్ మేళా ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో పని చేస్తూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రజలకు మరింత వేగవంతంగా, సమర్థవంతంగా సేవలు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కమిషనరేట్ పరిధిలోని అదనపు డిసిపిలు, ఎసిపిలు, ఇన్స్పెక్టర్లు, సబ్-ఇన్స్పెక్టర్లు మరియు పోలీస్ సిబ్బంది సంఖ్యలో పాల్గొన్నారు.




