Siddipet: ఉత్తమ ప్రతిభ చూపిన పోలీసులకు సిపీ రష్మి పెరుమాళ్ ప్రశంసా పత్రాలు
Siddipet: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌లో 'సీపీ కనెక్ట్'. ప్రతిభ కనబరిచిన 15 మంది పోలీసులకు ప్రశంసా పత్రాలు, ప్రత్యేక కిట్లు అందజేసిన సీపీ రష్మి పెరుమాళ్.
Siddipet: ఉత్తమ ప్రతిభ చూపిన పోలీసులకు సిపీ రష్మి పెరుమాళ్ ప్రశంసా పత్రాలు
సిద్దిపేట: శాంతిభద్రతల పరిరక్షణలో మరియు నేరాల నియంత్రణలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను, సిబ్బందిని ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన 'సీపీ కనెక్ట్' కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఉత్తమ ప్రతిభ కనబరిచిన 15 మంది పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
కమిషనరేట్ కార్యాలయంలో వారికి ప్రశంసా పత్రాలు మరియు ప్రత్యేక కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ,గత కొన్ని రోజులుగా విధినిర్వహణలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన సిబ్బందినీ అభినందించారు. రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉంటూ, సాంకేతికతను ఉపయోగించి పాత నేరస్థులను పట్టుకోవడం, దొంగతనాలకు అడ్డుకట్ట వేయడం అభినందనీయం అని, ఇదే నిబద్ధతతో సిబ్బంది అంతా పనిచేసి కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు కృషి చేయాలనీ సిబ్బందికి సూచించారు.
ప్రజలకు సమర్థవంతంగా సేవ చేయడానికి 'సీపీ కనెక్ట్' చొరవ ద్వారా మరింత బలమైన, సమైక్య మరియు స్పందించే బృందాన్ని నిర్మించడానికి పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని సిపి రష్మీ పెరుమాళ్ గారు తెలిపారు.




