Siddipet: వరుస దొంగతనాల ముఠా గుట్టురట్టు.. నిందితుల అరెస్ట్!
Siddipet: సిద్దిపేట జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
Siddipet: వరుస దొంగతనాల ముఠా గుట్టురట్టు.. నిందితుల అరెస్ట్!
Siddipet: సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి,బెజ్జంకి పోలీస్ స్టేషన్ ల పరిధిలో పలు దొంగతనాలు, పోలీస్ దొంగతనాలకు పాల్పడిన ముఠా సభ్యులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ,రాత్రి సమయాల్లో తాళము వేసిన ఇండ్లను, ఇంటి బయట నిద్రిస్తున్న మహిళలను లక్ష్యంగ పెట్టుకుని వరుస దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు.
వారి వద్ద నుండి తొమ్మిది తులాల బంగారూ ఆభరణాలు పన్నెండు తులాల వెండి ఆభరణాలు ఒక్క కారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.ఈ రోజు ఉదయం చేర్యాల మండల పరిధిలోని గుర్జకుంట వద్ద వాహనలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా నిందితుల కదలికలు కనిపించగా వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు. ఎవరు కూడా మహిళలు ఆరు బయట నిద్రించకూడదని సూచించారు. బంగరు ఆభరణాలను లాకర్ లలో భద్రపరచుకోవాలి అని తెలిపారు. గ్రామాలలో అనుమానస్పద వ్యక్తులు ఎవరూ కనిపించిన పోలీసులకు సమాచారం అందించాలన్నారూ.




