Siddipet: నిద్రిస్తున్న మహిళపై దాడి.. పుస్తెల తాడుతో దొంగలు పరార్!
Siddipet: సిద్దిపేట జిల్లా తొగుటలో దొంగల బీభత్సం. ఇంటి బయట నిద్రిస్తున్న మహిళ నోట్లో గుడ్డలు కుక్కి, మూడు తులాల బంగారు పుస్తెల తాడును అపహరించిన దుండగులు.
Siddipet: నిద్రిస్తున్న మహిళపై దాడి.. పుస్తెల తాడుతో దొంగలు పరార్!
Siddipet: సిద్దిపేట జిల్లాలోని తొగుటలో అర్థరాత్రి దొంగలు రెచ్చిపోయారు. ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఓ మహిళపై దాడి చేసి, ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును అపహరించారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో చోరీ ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన సీత బాలమణి (46) అనే మహిళ ఇంటి బయట నిద్రిస్తుండగా, అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని దొంగలు ఆమె వద్దకు చేరుకున్నారు.
మహిళ అరవకుండా ఉండేందుకు నోట్లో గుడ్డలు కుక్కిన దుండగులు, ఆమె మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు పుస్తెల తాడును అపహరించి పరారయ్యారు. ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తొగుట పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.




