Thoguta: నేల ఆరోగ్యాన్ని సంరక్షిద్దాం.. వరి కొయ్యలు కాల్చవద్దు
Thoguta: సిద్దిపేట జిల్లా తొగుట మండలం బండారుపల్లిలో కేత్ బచావో అభియాన్ కింద రైతులకు అవగాహన; వరి కొయ్యలు కాల్చకుండా నేలలో కలియదున్నాలని ఏవో మోహన్ సూచన.
Thoguta: నేల ఆరోగ్యాన్ని సంరక్షిద్దాం.. వరి కొయ్యలు కాల్చవద్దు
తొగుట: వరి కొయ్యలను కాల్చితే రైతులకు నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు అని వ్యవసాయ శాఖ మండల వ్యవసాయ అధికారి మోహన్ సిద్దిపేట జిల్లా తొగుట మండలం బండారుపల్లి గ్రామంలో కేత్ బచావో అభియాన్ లో భాగంగా రైతులకు పంట వ్యర్ధాల పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. వరి కొయ్యలను కాల్చితే విపరీతమైన వేడితో నత్రజని, ఫాస్పరస్ లాంటి పోషక పదార్ధాల శాతం తగ్గుతుంది.
పంటలకు అవసరమైన ఖనిజ, లవణాలు దెబ్బతింటాయి. పొలాల్లో తిరిగే పాములు, ఉడుములు, తొండల్లాంటి అనేక రకాల జీవరాశులు చనిపోయే ప్రమాదం ఉంది. ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది.
పొలాన్ని కలియ దున్నితే ఎన్నో లాభాలు ఉన్నాయి వరి కొయ్యలను నేలలో కలియదున్నడం వల్ల సేంద్రియ కర్బనశాతం పెరిగి దిగుబడులు 5 నుంచి 10శాతం వరకు అధికంగా వచ్చే అవకాశముంది.దుక్కి దున్నే సమయంలో సింగిల్ సూపర్‌ఫాస్పేట్ లేదా వేస్ట్ డీకంపోజర్ చల్లితే వరి కొయ్యల అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా అందుబాటులోకి వస్తాయి.




