Dubbak: కాంగ్రెస్ నేత మచ్చ శ్రీనివాస్‌కు ఫోన్‌లో బెదిరింపులు!

Dubbak: దుబ్బాక ఎమ్మెల్యేపై విమర్శలు చేసినందుకు ఫోన్‌లో బెదిరింపులు వస్తున్నాయంటూ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ దుబ్బాక సీఐకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 9 Nov 2026 9:42 PM IST
Dubbak
X

Dubbak: కాంగ్రెస్ నేత మచ్చ శ్రీనివాస్‌కు ఫోన్‌లో బెదిరింపులు!

దుబ్బాక: రాజకీయ విమర్శల నేపథ్యంలో తనకు ఫోన్‌ ద్వారా ప్రాణహాని బెదిరింపులు వస్తున్నాయని కాంగ్రెస్‌ పార్టీ సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్‌ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్‌,కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి దుబ్బాక సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పనితీరు, అవినీతి ఆరోపణలు, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై తాను ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నలు లేవనెత్తుతున్నానని శ్రీనివాస్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మోతె గ్రామానికి చెందిన కొత్త రాజిరెడ్డి అనే వ్యక్తి ఫోన్‌ ద్వారా తనను బెదిరించడంతోపాటు, అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపించారు. మరోసారి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిని విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, తన అంతు చూస్తానని హెచ్చరించినట్లు తెలిపారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK