Dubbak: దుబ్బాక మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు ఘనంగా నిర్వహణ

Dubbak: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేట తెలంగాణ మోడల్ స్కూల్‌లో చెకుముకి సైన్స్ సంబరాలు; విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెరగాలన్న డీసీఈబీ సెక్రెటరీ.

Chindam Karunakar, Dubbak
Published on: 21 Nov 2026 3:45 PM IST
Dubbak
X

Dubbak: దుబ్బాక మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు ఘనంగా నిర్వహణ

దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు తెలంగాణ మోడల్ స్కూల్ లచ్చపేట లో నిర్వహించినట్లు జీవివి కన్వీనర్ పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ బుచ్చిబాబు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దుబ్బాక శ్రీ టి చక్రపాణి డిసిఇబి సెక్రెటరీ సిద్దిపేట మరియు విశిష్ట అతిధులు బి రవీందర్ ధర్మాజీపేట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు , కె .సంజీవ , వి .తిరుపతి లచ్చపేట, రామక్కపేట గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గార్లు విచ్చేయడం జరిగింది.

ఈరోజు తెలంగాణ మోడల్ స్కూల్ లచ్చపేట లో చెకుముకి టాలెంట్ సంబరాలు ఉదయం: 11 గంటల నుండి 12 గంటల వరకు 8వ, 9వ,10వ తరగతుల ఆంగ్ల మాధ్యం మండలం నుండి మండలంలోని ప్రభుత్వ , రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు ప్రైవేటు పాఠశాలల నుంచి ఒక్కొక్క పాఠశాల నుండి ముగ్గురు విద్యార్థులు ప్రతిభ పరీక్షల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి టి చక్రపాణి డీసీబీ సెక్రెటరీ సిద్దిపేట గారు మాట్లాడుతూ విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం అవగాహన పెంచుకొని శాస్త్రీయ సమాజంలో నిర్మాతలుగా రావాలని తెలపడం జరిగింది.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak