Dubbak: రాష్ట్ర స్థాయి కరాటేలో దుబ్బాకకు 9 గోల్డ్ మెడల్స్.. 100% విజయం!
Dubbak: సంగారెడ్డి జిల్లా భానూర్‌లో జరిగిన తెలంగాణ స్టేట్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్–2026లో సిద్దిపేట జిల్లా దుబ్బాక విద్యార్థులు 9 బంగారు పతకాలతో 100% విజయం సాధించారు.
Dubbak: రాష్ట్ర స్థాయి కరాటేలో దుబ్బాకకు 9 గోల్డ్ మెడల్స్.. 100% విజయం!
దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక విద్యార్థుల చారిత్రాత్మక ఘనత, 9 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొని.. 9 బంగారు పతకాలు సాధించి దుబ్బాక మండలానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. సంగారెడ్డి జిల్లా భానూర్‌లో నవంబర్ 15న నిర్వహించిన తెలంగాణ స్టేట్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్–2026లో దుబ్బాక మండలానికి చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి ఘన విజయం సాధించారు. ఈ పోటీల్లో దుబ్బాక మండలం నుంచి 9 మంది విద్యార్థులు పాల్గొని, 9 బంగారు పతకాలు సాధించి 100 శాతం విజయాన్ని నమోదు చేశారు.
యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన దుబ్బాక మండలంలోని నాలుగు పాఠశాలలకు చెందిన విద్యార్థులు వివిధ విభాగాల్లో తమ ప్రతిభను చాటుకుని బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. పాఠశాలల వారీగా బంగారు పతకాల వివరాలు మాస్టర్ మైండ్ స్కూల్, దుబ్బాక – 5 గోల్డ్ మెడల్స్,సరస్వతి గ్లోబల్ స్కూల్ – 2 గోల్డ్ మెడల్స,గాయత్రి వివేకానంద విద్యాలయం – 1 గోల్డ్ మెడల్ రజనీకాంత్ రెడ్డి స్కూల్ – 1 గోల్డ్




