Dubbaka: దుబ్బాకలో తీవ్ర విషాదం ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ మృతి!
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఉచిత బస్సు ప్రభావం, ఆర్థిక ఒత్తిడితో ఆటో డ్రైవర్ షాదుల్లా మృతి. బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని వినతి.
Dubbaka: దుబ్బాకలో తీవ్ర విషాదం ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ మృతి!
Dubbaka: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పోషణ భారంతో తీవ్ర ఒత్తిడికి గురైన సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ డబుల్ బెడ్ రూమ్ లో నివసిస్తున్న మహమ్మద్ షాదుల్లా 43. ఆటో డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. చిన్న వయసులోనే కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదానికి గురయ్యారు. మృతుడు ఆటో నే జీవిత ఆధారంగా నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఆయనకు ముగ్గురు కుమార్తెలు భార్య ఉన్నారు. ఆటో డ్రైవింగ్నే జీవనాధారంగా చేసుకుని కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రావడంతో ఆటోల్లో ప్రయాణించే ప్రజల సంఖ్య తగ్గిపోయిందని, దీంతో ఆటో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఆదాయం తగ్గడంతో కుటుంబ పోషణ కోసం అప్పులు చేయాల్సి వచ్చిందని, ఆర్థిక సమస్యలు మరింత తీవ్రమై అనారోగ్యం అవడంతో ఈ క్రమంలో తీవ్ర ఆర్థిక, కుటుంబ సమస్యలతో ఒత్తిడికి గురయ్యారు.




