Cheriyal: చేర్యాల శ్రీనగర్ కాలనీలో మట్టి గణపతి ప్రతిష్ఠాపన

Cheriyal: సిద్దిపేట జిల్లా చేర్యాల శ్రీనగర్ కాలనీలో వైభవంగా వినాయక నవరాత్రులు. మట్టి గణపతిని ప్రతిష్టించి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసిన సొసైటీ సభ్యులు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 14 Sept 2026 9:49 PM IST
Cheriyal
X

Cheriyal: చేర్యాల శ్రీనగర్ కాలనీలో మట్టి గణపతి ప్రతిష్ఠాపన

చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో శ్రీనగర్ కాలనిలోని శ్రీనగర్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు ప్రతి యేటా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది.

అదే విధంగా ఈ సారి మట్టి గణపతిని ప్రతిష్టించి తొలిరోజు వెల్ఫేర్ సొసైటీ సభ్యులు కుంటుంబ సమేతంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవం గా పూజలు నిర్వహించారు.

పూజలో పాల్గొన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL