Daulthabad: రైతుల సమస్యలపై దౌల్తాబాద్ AMC చైర్మన్ కనకయ్య యాదవ్ కీలక అడుగు.. రంగంలోకి వ్యవసాయ కమిషనర్!
Daulthabad: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ ఎం. కోదండ రెడ్డిని కోరారు AMC చైర్మన్ కనకయ్య యాదవ్.
Daulthabad: రైతుల సమస్యలపై దౌల్తాబాద్ AMC చైర్మన్ కనకయ్య యాదవ్ కీలక అడుగు.. రంగంలోకి వ్యవసాయ కమిషనర్!
దౌల్తాబాద్ (సిద్దిపేట): రైతుల సమస్యల పరిష్కారానికి అధికారులతో ప్రత్యేక చర్చలు నిర్వహించిన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ AMC చైర్మన్ కనకయ్య యాదవ్.M. కోదండ రెడ్డి తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషనర్ కలిసి మండలంలోని సన్ ఫ్లవర్, మొక్కజొన్న, వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ కు ఫోన్ ద్వారా వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయించడం జరిగింది. అలాగే రైతులు ఎదుర్కొంటున్న లారీల కొరత సమస్యపై కూడా ప్రత్యేకంగా చర్చించారు.ఈ కార్యక్రమంలో తొగుట మాజీ AMC చైర్మన్ గోవింద్ రెడ్డి గారు, మాదాడి విజయ్ భాస్కర్ రెడ్డి గారు, మహేష్ యాదవ్ గారు తదితరులు పాల్గొన్నారు.
Next Story




