Siddipet: పంటలు అమ్మినా రైతులకు అందని మార్క్‌ఫెడ్ చెల్లింపులు

Siddipet: మార్క్‌ఫెడ్‌కు పంటలు అమ్మిన రైతులు నెల రోజులైనా చెల్లింపులు అందక ఇబ్బందులు పడుతున్నారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 11 May 2026 11:25 AM IST
Siddipet
X

Siddipet

Siddipet: తొగుట మండలం తుక్కాపూర్‌కు చెందిన చిక్కుడు చంద్రం మక్కజొన్న సాగు చేయగా 130 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. నెల రోజుల కింద తొగుట మార్కెట్ యార్డులోని కొనుగోలు సెంటర్‌లో అమ్మాడు. రూ.3.12 లక్షలు రావాల్సి ఉండగా నెలైనా డబ్బులు రాలేదు. దీనిపై అధికారులను అడిగినా సమాధానం చెప్పడం లేదని రైతు వాపోతున్నాడు. ఇది ఒక్క చిక్కుడు చంద్రం ఎదుర్కొంటున్న సమస్య కాదు జిల్లాలో మార్క్‌ఫెడ్‌కు మక్కజొన్న అమ్ముకున్న 4,252 మంది రైతుల పరిస్థితి.తొగుటకుచెందిన రైతు బండారి మల్లేశం రెండకరాల్లో సన్ ఫ్లవర్‌ సాగుచేయగా 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. నెల రోజుల కింద తొగుట మార్కెట్‌లో పంటను అమ్మగా రూ. 92,652 రావాల్సి ఉంది. ఇప్పటివరకు ఖాతాలో డబ్బులు పడలేదు. మార్క్ ఫెడ్ అధికారులను సంప్రదిస్తే నిధులు విడుదల కాగానే ఖాతాలోకి జమ అవుతాయని చెప్పారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story