Siddipet: మద్దూరు కేజీవీబీలో ఫుడ్ పాయిజన్.. 18 మందికి అస్వస్థత

Siddipet: మద్దూరు కేజీవీబీ బాలికల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్‌తో 18 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత. చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు, వైద్యుల పర్యవేక్షణ.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 16 Aug 2026 11:27 PM IST
Siddipet
X

Siddipet: మద్దూరు కేజీవీబీలో ఫుడ్ పాయిజన్.. 18 మందికి అస్వస్థత

సిద్దిపేట: మద్దూర్ మండల కేంద్రం లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీవీబీ ) లో ఫుడ్ ఫైజన్ కావడంతో 18 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత కు గురి కావడం జరిగింది వీరిని హుటా హుటిగా చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఫుడ్ ఫైజన్ నా లేక ఇతర కారణాలవల్ల నా అన్నది వైద్య పరీక్షల అనంతరం వెలువడ నుండి ఒక్కసారిగా పలువురి విద్యార్థినిలు అస్వస్థకు గురి కావడంతో వారి తల్లిదండ్రులలో పాటు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురైయ్యారు ఘటనపై సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి కారణాలను వెల్లడించడంతో పాటు విద్యార్థిని ల ఆరోగ్య భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

విషయం తెలుసుకున్న మద్దూరు ఎంపీడీవో రామ్మోహన్ అలాగే చేర్యాల సిఐ రమేష్ నాయక్ కేజీబీసివో నర్మదా ఆసుపత్రికి చేరుకొని అస్వస్థకు గురైన విద్యార్థులను పరామర్శించారు. ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ దేవేందర్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL

Next Story