Gajwel: గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది: సీపీఐ!
Gajwel: గజ్వేల్ ఆర్డీవో కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందని, డబ్బులు ఇవ్వనిదే భూ దరఖాస్తులు కదలడం లేదని సీపీఐ నేతలు ఆరోపించారు. విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Gajwel: గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది: సీపీఐ!
గజ్వేల్: సిద్దిపేట గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు సమర్పించే దరఖాస్తులు డబ్బులు ఇవ్వనిదే ముందుకు కదలడం లేదని సీపీఐ నాయకులు ఆరోపించారు. కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలపై ఉన్నతాధికారులతో సమగ్ర విచారణ జరిపించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నాయకులు డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రజావాణిలో భూ సమస్యపై పెద్దిరెడ్డి పద్మ అనే వ్యక్తి నాలుగు నెలల క్రితం దరఖాస్తు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం లభించలేదని తెలిపారు. దరఖాస్తును ఎమ్మార్వో కార్యాలయానికి పంపించామని ఆర్డీవో కార్యాలయ సిబ్బంది చెబుతున్నారని, దరఖాస్తుల ఆన్‌లైన్ నమోదు, పరిష్కార ప్రక్రియ సక్రమంగా అమలవుతున్నాయా లేదా అన్నది పరిశీలించాలని కోరారు.
వివిధ మండలాల నుంచి వచ్చిన ఫౌతి, ఇతర భూ సంబంధిత దరఖాస్తుల వివరాలు, వాటి పరిష్కార స్థితిపై విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులను కోరారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకులు బట్టు దయానందరెడ్డి, గజ్వేల్ మండల కార్యదర్శి శివలింగ కృష్ణ, గజ్వేల్ పట్టణ కార్యదర్శి స్వర్గం రాజేశం తదితరులు పాల్గొన్నారు.




