Siddipet: చేర్యాల పెద్ద చెరువులోకి గోదావరి జలాలు విడుదల.!
Siddipet: సిద్దిపేట జిల్లా చేర్యాల పెద్ద చెరువులోకి గోదావరి జలాలు విడుదల చేయడంతో భూగర్భ జలాలు పెరుగుతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Siddipet: చేర్యాల పెద్ద చెరువులోకి గోదావరి జలాలు విడుదల.!
Siddipet: చేర్యాల ఎల్ ని నో ప్రభావం తో సరియైన వర్షాలు కురువ పోవడం తో చేర్యాల పట్టణంలో ఇండ్లలోని బోర్లు తగ్గుముఖం పట్టాయి గంటల తరబడి మోటార్లు వేసిన ట్యాంకులు నిండే పరిస్థితి లేదు
దీనికి ముక్యంగా పెద్ద చెరువు లో నీటి మట్టం భారీగా తగ్గడంతో ఇండ్లలోని బోర్లు ఎండి పోయే పరిస్థితి నెలకొంది ఈ చెరువు నిండడం వలన చేర్యాల పట్టణమే కాకుండా చుట్టుపక్క గ్రామాల కూడా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తపాస్ పల్లి రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేసి పెద్ద చెరువును నిపుతున్నందుకు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇది నామ మాత్రమే కాకుండ పూర్తి స్థాయిలో చెరువును నింపి నీటి ఎద్దడి రాకుండా చూడాలని ప్రజల కోరుతున్నారు




