Siddipet: సిద్దిపేట జిల్లాలో భవన నిర్మాణ సంఘం జెండా ఆవిష్కరణ
Siddipet: సిద్దిపేట మున్సిపల్ పరిధి లింగారెడ్డిపల్లిలో భవన నిర్మాణ సంఘం జెండా ఆవిష్కరణ; కార్మికులను ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని ఆరోపణ.
Siddipet: సిద్దిపేట జిల్లాలో భవన నిర్మాణ సంఘం జెండా ఆవిష్కరణ
Siddipet: ప్రభుత్వాలు కార్మికులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయే తప్ప కార్మికులకు ఏ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని BNRKS జిల్లా అధ్యక్షుడు దూబల శ్రీశైలం అన్నారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి ఒకటవ వార్డు లింగారెడ్డిపల్లి గ్రామంలో సుతారి సంఘం అధ్యక్షులు తాటికొండ కనకయ్య ఆధ్వర్యంలో భవన నిర్మాణ సంఘం జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశైలం ముఖ్యఅతిథిగా పాల్గొని జండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ. ఎన్ని ప్రభుత్వాలు మారిన భవన నిర్మాణ రంగా కార్మికుల బ్రతుకులు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న 14 రంగాల కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
అలాగే 58 సంవత్సరాలు దాటిన భవన కార్మికులకు పెన్షన్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు లక్ష్మీ నారాయణ,తాటికొండ కనకయ్య ,నర్సింలు, ఊశయ్య, రాజేల్లయ్య,రాజేశం , ఎల్లయ్య,నరేష్,పరశు రాములు పాల్గొన్నారు.




