Dubbaka: 13 ఏళ్ల తర్వాత చేనేత సంఘాల ఎన్నికలు సిద్దిపేట జిల్లాలో పొలిటికల్ సందడి
Dubbaka: సిద్దిపేట, దుబ్బాక చేనేత సహకార సంఘాల ఎన్నికల రేస్ ప్రారంభం. 4వ తేదీన నామినేషన్లకు ఆఖరి గడువు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు.
Dubbaka: 13 ఏళ్ల తర్వాత చేనేత సంఘాల ఎన్నికలు సిద్దిపేట జిల్లాలో పొలిటికల్ సందడి
దుబ్బాక: సిద్దిపేట జిదుబ్బాక చేనేత సహకార సంఘాల్లో ఎన్నికల సందడి మొదలైంది. 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో ప్రాధా న్యత సంతరించుకుంది. ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమపార్టీల అభ్యర్థు లను నిలబెట్టి గెలిపించుకోవాలనే పట్టుదలతో సమీకరణల్లో మునిగితేలుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికలపై దృష్టి సారించి పావులు కదుపుతుండటం విశేషం.
4వ తేదీ నామినేషన్లకు చివరి రోజు
జిల్లాలో మొత్తం 18 చేనేత, ఉన్ని సంఘాలు ఉన్నాయి. మొదటి విడతలో 13 సొసైటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. 4వ తేదీ చివరి రోజు కావడంతో పోటీ చేసేందకు ఆసక్తిగా ఉన్న అభ్యర్థులతో ఆయా సంఘాల్లో ఎన్నికల సందడి నెలకొంది. దుబ్బాక, సిద్దిపేట, ఇర్కోడ్, సిద్దిపేట ప్రాజెక్టు, గజ్వేల్, దుద్దెడ చేనేత సం ఘాలతో పాటు లింగారెడ్డిపల్లి, శ్రీరాములపల్లి, ధర్మారం, గజ్వేల్ ఉన్ని సంఘాలకు పోలింగ్ జరుగుతుంది.




