Siddipet: చేర్యాల రోడ్ల పక్కనే చెత్త కుప్పలు.. పందుల స్వైరవిహారం!

Siddipet: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన చెత్త వ్యర్థాలు పేరుకుపోయి పందులు స్వైరవిహారం చేస్తున్నాయి.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 22 Aug 2026 4:04 PM IST
Siddipet
X

Siddipet: చేర్యాల రోడ్ల పక్కనే చెత్త కుప్పలు.. పందుల స్వైరవిహారం!

సిద్దిపేట: చేర్యాల పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కనే విచ్చలవిడిగా చెత్త వ్యర్ధాలను వేయడంతో పందులు చెత్త కుప్పలపై స్వైర విహారం చేస్తున్నాయి, అసలే వర్షం కాలం సిజినల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉంటుంది.

రోజు వందలాది మంది ప్రజలు తిరిగే చుంచనకోట క్రాసింగ్ రోడ్డు వద్ద ప్రధాన కూడలి లోను ఇలాంటి చెత్త కుప్పలు దర్శన మిస్తున్నాయి కుప్పలపై స్వైర్య విహారం చేస్తున్న పందులను చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ అధికారులు రోడ్డు ప్రక్కన పేరుక పోయిన చెత్తను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL

Next Story