Husnabad: హుస్నాబాద్‌లో బతుకమ్మ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి!

Husnabad: హుస్నాబాద్‌ పట్టణంలో బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, కమిషనర్ టి. మల్లికార్జున్ పరిశీలించారు. మహిళలకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 16 Oct 2026 6:30 PM IST
Husnabad
X

Husnabad: హుస్నాబాద్‌లో బతుకమ్మ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి!

హుస్నాబాద్‌ అక్టోబర్ 16: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ దండి లక్ష్మి, కమిషనర్‌ టి.మల్లికార్జున్‌ శుక్రవారం పట్టణంలోని ఎల్లమ్మ చెరువు ,పల్లె చెరువు వద్ద క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలోని ప్రధాన బతుకమ్మ ఘాట్లు, చెరువులు, మహిళలు అధికంగా పాల్గొనే ప్రాంతాలను సందర్శించి ఏర్పాట్ల పురోగతిని సమీక్షించారు.

పండుగ సందర్భంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి, బతుకమ్మ ఆడే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.ఈ ఏర్పాట్ల పరిశీలనలో మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, తదితరులు ఉన్నారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD