Husnabad: ఛలో ఢిల్లీకి హుస్నాబాద్ నుంచి భారీగా కాంగ్రెస్ శ్రేణులు!
Husnabad: ఓట్ చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపుతో నవంబర్ 1న ఢిల్లీలో జరిగే సభకు హుస్నాబాద్ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు తరలివెళ్లాయి.
Husnabad: ఛలో ఢిల్లీకి హుస్నాబాద్ నుంచి భారీగా కాంగ్రెస్ శ్రేణులు!
హుస్నాబాద్: ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు నవంబర్ 1వ తేదీన ఢిల్లీలో నిర్వహించనున్న ఛలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సుల్లో ఢిల్లీకి బయలుదేరారు.
రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సుల ద్వారా నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి పయనమయ్యారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు పవిత్రతను కాపాడటం, ఓట్ చోరీకి వ్యతిరేకంగా గళమెత్తడం లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొననున్నాయి.




