Siddipet: రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు క్రాంతి స్కూల్ విద్యార్థులు
Siddipet: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైన సిద్దిపేట క్రాంతి హైస్కూల్ విద్యార్థులు. అభినందించిన కరస్పాండెంట్.
Siddipet: రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు క్రాంతి స్కూల్ విద్యార్థులు
సిద్దిపేట: క్రాంతి హై స్కూల్‌కు చెందిన రేవన్ నిర్దేశ్ రెడ్డి, లింగంపేట శశాంక్ మరియు నాగోల్ సాత్విక్ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్-జూనియర్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యారు.
ఈ పోటీలు సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లాలోని తిలక్ స్టేడియంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీ భగవాన్ రెడ్డి గారు మాట్లాడుతూ,
“మన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉంది. వారికి నా అభినందనలు. మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను.” అన్నారు.
విద్యార్థులకు శిక్షణ అందించిన కోచ్‌లు రాజు, నవీన్, లావణ్యలను పాఠశాల యాజమాన్యం అభినందించింది. క్రాంతి హై స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.




