Siddipet: విద్యార్థులపై లాఠీచార్జ్ దారుణం మంత్రి పొన్నం ప్రభాకర్

Siddipet: హుస్నాబాద్‌లో కాంగ్రెస్ నిరసన. నీట్ లీకేజీపై విద్యార్థుల పోరాటాన్ని అణచివేయడం, రాహుల్ గాంధీ అరెస్ట్‌ను ఖండించిన మంత్రి పొన్నం ప్రభాకర్.

SRINIVAS, HUSNABAD
Published on: 22 July 2026 4:38 PM IST
Siddipet
X

Siddipet: విద్యార్థులపై లాఠీచార్జ్ దారుణం మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట: డిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థుల పై జరిగిన లాఠీచార్జి విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి, హోం మంత్రి కనీసం స్పందించకపోవడం ఆప్రజాస్వామికమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ ల అరెస్టులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలిసి మంత్రి పాల్గొని నిరసన తెలిపారు.

నీట్ పేపర్ లీకేజ్ విషయంలో విద్యార్థులపై జరిగిన దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, ఎంపీలు ప్రధాని ఇంటి ముందు శాంతియుతంగా నిరసన చేస్తుంటే వారిని అక్రమంగా అరెస్టు చేశారని మండి పడ్డారు.

ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసన ప్రజాస్వామ్యంలో మరో స్వతంత్ర ఉద్యమాన్ని, సత్యాగ్రహాన్ని తలపించిందన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులు పోలీసులు కొడుతుంటే తిరగబడకుండా ఇంకా కొట్టండి అని జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేశారని వెల్లడించారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీ, స్వతంత్రాన్ని తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, లాఠీ చార్జికి బాధ్యులైన వారిని సస్పెండ్ చేసి, గాయపడిన వారికి మంచి వైద్యం అందించాలన్నారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, పేపర్ లీకేజ్ కి కారణమైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు.

ధర్మేంద్ర ప్రధాన్ ను ఎందుకు కాపాడుతున్నారో చెప్పాలని, నీట్ పేపర్ లీకేజీ పై పార్లమెంట్ లో చర్చించాలన్నారు. లాఠీ చార్జి పై స్పందించి, నీట్ పై చర్చించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అంబేద్కర్ సాక్షిగా డిమాండ్ చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ఎంపీల అక్రమ అరెస్టును హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

SRINIVAS, HUSNABAD

SRINIVAS, HUSNABAD

Next Story