Siddipet: హరీష్ రావు కృషితోనే సిద్దిపేటకు మల్లన్న సాగర్ జలాలు
Siddipet: సిద్దిపేట 3వ వార్డులో 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల నూతన వాటర్ ట్యాంక్‌ను మున్సిపల్ చైర్‌పర్సన్ మంజుల రాజనర్సు ప్రారంభించారు.
Siddipet: హరీష్ రావు కృషితోనే సిద్దిపేటకు మల్లన్న సాగర్ జలాలు
Siddipet: మల్లన్న సాగర్ ద్వారా సిద్దిపేటకు నీరు తీసుకువచ్చి మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట ప్రజల నీటి ఎద్దడిని పూర్తిగా తొలగించారని సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్సు, మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ అన్నారు. సిద్దిపేట పట్టణంలోని మూడవ వార్డు సాయి దీప్ నగర్ లో నూతనంగా నిర్మించిన 10 లక్షల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ ను మూడో వార్డు కౌన్సిలర్ వంగ రేణుకా తిరుమలరెడ్డి తో కలిసి మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్సు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా పట్టణ ప్రజల నీటి సరఫరా కోసం మూడవ వార్డు లో నూతన వాటర్ ట్యాంక్ నిర్మించామని తెలిపారు. ఈ వాటర్ ట్యాంక్ ద్వారా నీటిని సరఫరా చేయడం వల్ల వార్డులోని కుశాల్ నగర్, ఆదర్శనగర్, రాజేంద్రనగర్, దక్కలి కాలనీ, సాయిదీప్ నగర్ లో నివసిస్తున్న ప్రజల నీటి కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు. సిద్దిపేటకు వాటర్ ట్యాంకులు మంజూరు చేయించడంలో కృషిచేసిన మాజీ మంత్రి హరీష్ రావు.




