Siddipet: సిద్దిపేటలో అంతర్ జిల్లా చైన్ స్నాచర్ అరెస్ట్!

Siddipet: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

RAJU, SIDDIPET
Published on: 8 July 2026 9:17 AM IST
Siddipet
X

Siddipet: సిద్దిపేటలో అంతర్ జిల్లా చైన్ స్నాచర్ అరెస్ట్!

Siddipet: వరుస దొంగతనాలు, చైన్ స్నాచింగ్ కేసుల్లో అంతర్ జిల్లా దొంగ అరెస్ట్. 7 లక్షల విలువ గల సొత్తు స్వాధీనం. నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో acp రవీందర్ రెడ్డి మాట్లాడుతూ,కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపల్లి కి చెందిన కుంచం రాజు ఏప్రిల్ 20 వ తేదీన ముస్తాబాద్ వెళుతున్న యాదవ్వా అనే మహిళను నమ్మించి మోటార్ సైకిల్ పై ఎక్కించుకొని మార్గ మధ్యలో నాలుగు తులాల బంగారూ పుస్తెలు తాడు తీసుకుని పారిపోయాడు.

జూన్ 30 న దుద్దెడ గ్రామనికి చెందిన మహిళా టోల్గెట్ వద్ద మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును లాక్కోని వెళ్ళిపోయినాడు. నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతననికి పాల్పడినట్లు తెలిపారు.నిందితుని వద్ద బంగారు ఆభరణాలు స్వాధీన పరుచుకొని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ ఐ.పి.ఎస్ ఆదేశానుసారం సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ బాబు, ఎస్.ఐ కర్నాకర్ రెడ్డి, క్రైం కానిస్టేబుళ్లు మంత్రి శ్రీనివాస్, వనం నవీన్,అశోక్ లను అభినందించారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET

Next Story