Siddipet: జీవో 97ను రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా
Siddipet: భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట కలెక్టరేట్ ముందు విద్యార్థులు ధర్నా నిర్వహించారు.
Siddipet: జీవో 97ను రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా
సిద్దిపేట: పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో నేట్టడానికి తెచ్చిన జి ఓ నెంబర్ 97 ను వెంటనే రద్దు చేయాలని సిద్దిపేట పాలిటెక్నిక్ విద్యార్థులు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
విద్యార్థుల ధర్నా కు బి ఆర్ ఎస్ వి నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నం చేశారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలోని పాలిటెక్నిక్ విద్యార్థులు జీవో 97 రద్దు చేయాలన్నారు. పాలిటెక్నిక్ విద్యను అలాగే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఎన్నో అశలతో పాలిటెక్నిక్ చదువుదామని అనుకుంటున్న విద్యార్థులపై జి ఓ 97 నీళ్లు చళ్ళుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జి ఓ రద్దు చేసి పాలిటెక్నిక్ ను అలానే కొనసాగించకపోతే మరో ఉద్యమం చేస్తామని హేచ్చరించారు.




