Siddipet: సిద్దిపేట ప్రెస్ క్లబ్‌లో 'లంద' నవల ఆహ్వాన పత్రం ఆవిష్కరణ!

Siddipet: సిద్దిపేట జిల్లాకు చెందిన డాక్టర్ పొన్నాల బాలయ్య రచించిన ‘లంద’ నవల పరిచయ సభ నవంబర్ 15న సిద్దిపేట ప్రెస్ క్లబ్‌లో నిర్వహిస్తున్నట్లు ‘మరసం’ ప్రతినిధులు తెలిపారు.

RAJU, SIDDIPET
Published on: 11 Nov 2026 10:06 PM IST
Siddipet
X

Siddipet: సిద్దిపేట ప్రెస్ క్లబ్‌లో 'లంద' నవల ఆహ్వాన పత్రం ఆవిష్కరణ!

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కు చెందిన ప్రముఖ రచయిత, కవి డాక్టర్ పొన్నాల బాలయ్య రచించిన " లంద" నవల పరిచయ సభ ఈ నెల 15 న సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో జరుగుతుందని మంజీరా రచయితల సంఘం అధ్యక్షులు కె.రంగాచార్య, ప్రధాన కార్యదర్శి, కవి రచయిత సిద్దెంకి యాదగిరి, లంద రచయిత, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు పొన్నాల బాలయ్య, కార్యదర్శి గంభీర్రావు పేట యాదగిరి, తెలంగాణ వికాస సమితి అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎన్. భగవాన్ రెడ్డి, తెలంగాణ రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు తోట అశోక్ లు తెలిపారు.

బుధవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో మరసం ప్రతినిధులు కార్యక్రమ ఆహ్వానపత్రాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మాదిగ సామాజిక వర్గ జీవితాన్ని అక్షర బద్ధం చేసి పొన్నాల బాలయ్య " లంద " నవలను రచించాడని తెలిపారు. ఐదు నెలల క్రితం ఆవిష్కరించబడ్డ ఈ నవల తెలుగు సాహిత్యం లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నదని తెలిపారు.

ఈ నేపథ్యంలో పొన్నాల బాలయ్య పురిటిగడ్డ అయిన సిద్దిపేట జిల్లా లో నవలను పరిచయం చేయాలానే సంకల్పం తో సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఈనెల 15 న " లంద " నవల పరిచయ సభను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సభకు ముఖ్యఅతిధులుగా ప్రఖ్యాత కవి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ నందిని సిధారెడ్డి, ప్రముఖ కవి, గాయకుడు, శాసనమండలి సభ్యుడు దేశపతి శ్రీనివాస్, లు హాజరావుతారని తెలిపారు.

నవల పరిచయ కర్తగా ఎల్లారెడ్డి డిగ్రీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు, కవి, రచయిత వి. శంకర్, ఆత్మీయ అతిధులుగా TUWJ ( IJU ) రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ, TNGO సంఘం మాజీ అధ్యక్షులు దేవిప్రసాద్, తెలంగాణ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్,గుండె డప్పు కనకయ్య, ఓయూ బహుజన నాయకుడు నలిగంటి శరత్ చమార్ హాజరావుతారని తెలిపారు, ప్రముఖ కవులు సిద్దెంకి యాదగిరి, తైదల అంజయ్య, కె. అంజయ్య, తోట అశోక్, పప్పుల రాజిరెడ్డి, ముక్కెర సంపత్ కుమార్, పెద మాతరి బాబు మాదిగ, లింగారెడ్డి పల్లి ZPHS, HM కె. ప్రమీల గార్లు ఆత్మీయ సందేశాలు ఇస్తారని తెలిపారు.. సాహిత్య సభకు సాహితీ ప్రియులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంజీరా రచయితల సంఘం ప్రతినిధులు పిలుపునిచ్చారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET