Siddipet: పుస్తకాల పేరిట ప్రైవేట్ స్కూల్ భారీ దోపిడీ!

Siddipet: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ సెయింట్ ఆన్స్ ప్రైవేట్ స్కూల్ దందా. తాము చెప్పిన చోటే పుస్తకాలు కొనాలంటూ వాట్సాప్ గ్రూపుల్లో హుకుం.

Chindam Karunakar, Dubbak
Published on: 26 Jun 2026 8:41 AM IST
Siddipet
X

Siddipet: పుస్తకాల పేరిట ప్రైవేట్ స్కూల్ భారీ దోపిడీ!

Siddipet: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని హైమద్‌నగర్ గ్రామంలో ఉన్న సెయింట్ ఆన్స్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫారాలు విక్రయిస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతోందని పలువురు తల్లిదండ్రులు ఆరోపించారు.

పాఠశాల యాజమాన్యం సూచించిన దుకాణంలోనే పుస్తకాలు కొనుగోలు చేయాలని వాట్సాప్ గ్రూపుల ద్వారా తల్లిదండ్రులకు ఆదేశాలు జారీ చేసినట్లు వారు పేర్కొన్నారు. పుస్తకాలు ఎక్కడైనా కొనుగోలు చేసుకునే స్వేచ్ఛ ఉన్నప్పటికీ, యాజమాన్యం సూచించిన చోటే కొనాలని ఒత్తిడి తెస్తున్నారని తల్లిదండ్రులు వాపోయారు.

అవసరం ఉన్నా లేకున్నా పాఠశాల నిర్ణయించిన అన్ని పుస్తకాలు తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల వివరాల ప్రకారం ఎల్‌కేజీ విద్యార్థులకు పుస్తకాల సెట్ ధర రూ.2,585 ఉండగా, ఐదో తరగతి విద్యార్థులకు రూ.4,391 వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story