Siddipet: దౌల్తాబాద్‌లో 'SIR' కార్యక్రమం సక్సెస్
Siddipet: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో నిర్వహించిన SIR కార్యక్రమానికి భారీ స్పందన లభించింది.
Siddipet: దౌల్తాబాద్‌లో 'SIR' కార్యక్రమం సక్సెస్
Siddipet: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో మరియు దౌల్తాబాద్ మండలం తిరుమలపూర్, శేరిపల్లి బందారం, రాయపోల్ మండల కేంద్రంలో మరియు రాయపోల్ మండలం తిమ్మకపల్లి గ్రామాంలో నిర్వహించిన SIR కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్, కుమార్తె, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్‌పర్సన్ వెన్నెల, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొని SIR కార్యక్రమం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జనగామ మల్లారెడ్డి, రాయపోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాల దుర్గాప్రసాద్,, వైస్ చైర్మన్ మద్దెల స్వామి, దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగర రవి, తొగుట మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి, చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగళరావు, పంచమి గణేష్ తదితరులు పాల్గొన్నారు.




